పీఎం రేసులో ఉంటా..: కేసీఆర్

హైదరాబాద్, మే 11 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ అధినేత, తెలంగాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర
వ్యా ఖ్యలు చేశారు. అవకాశం వస్తే 100 స్తే శాతం ప్రధాని రేసులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ 12 లేదా 14 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కనీసం 9స్థానాల్లో మూడో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ 10 సీట్లు దాటదని అన్నారు. బీఆర్ఎస్కు 14 సీట్లు గెలిపిస్తే తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తానని కేసీఆర్ పేర్కొ న్నారు.

దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయింది.. ఈసారి బీజేపీ 200 చేరుకోవడం కష్టమేనని చెప్పారు. కచ్చితంగా ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అలాంటి ప్రభుత్వానికి బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని చూసి గోబెల్స్ సిగ్గుతో చచ్చిపోతారని అన్నారు. పదేళ్ల మోదీ పాలన చెత్త అని.. జీడీపీ వృద్ధి 2014 ద్ధికి ముందు 6.5 శాతం ఉంటే.. మోదీ పదేళ్ల కాలంలో 5.8 శాతంగా ఉందని అన్నారు.

లక్షల మంది రేవంత్ రెడ్డిలుడ్డి వచ్చినా కూడా బీఆర్ఎస్ను ఏం చేయలేరని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తారని చెప్పారని.. అయితే అది ఏ సంవత్సరం అని చెప్పలేదని సెటైర్లు వేశారు. తన బస్సు యాత్రకు విశేష స్పందన వచ్చిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను మించి ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో నాలుగు నెలల్లోనే ప్రజలు విసుగు చెందారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *