
- సెంట్రల్ యూవర్సిటీలో రేవంత్ రెడ్డి సందడి..
హైదరాబాద్, మే 12 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీలో సందడి చేశారు. హెచ్సీయూలోని గ్రౌం డ్లో పలువురితో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. ఈ గేమ్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సీయూ ఎన్ఎస్యూఐయూనిట్, హెచ్సీయూవిద్యార్థులు పాల్గొన్నారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. యువకులతో పోటీ పడుతూ రేవంత్ రెడ్డి గ్రౌండ్ ఫుట్ బాల్ ఆడి సందడి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వెంట సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ ఫహీం, టీ శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డితోడ్డి పాటు పలువురు హెచ్సీయూకు వెళ్లారు. ఇక, హెచ్సీయూ – ఎన్ఎస్యూఐ యూనిట్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూ ర్ వెంకట్, హెచ్సీయూ -ఎన్ఎస్యూఐ ఇంఛార్జి అజయ్ నేతృత్వంలో ఈ మ్యాచ్ నిర్వహించారు. ఇక, రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడుతూ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.