
మహిళ జర్నలిస్టులపై దాడి
చేసిన వారిపై కఠినమైన
చర్యలు తీసుకోవాలి

- డిజిపికి ఫిర్యాదు చేసిన టీయుడబ్ల్యూజే
హైదరాబాద్, ఆగస్టు 23 (విశ్వం న్యూస్) : నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో నిన్న మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిల పై దాడి చేసి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

రుణమాఫీ పై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళ జర్నలిస్టుల పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని డీజీపీకి వివరించాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరాము. ఈ అంశంపై స్పందించిన డిజిపి జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డిజిపిని కలిసిన వారిలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు ఉన్నారు.
ఈ ఆడబిడ్డ కన్నీటికి మూల్యం తప్పదు..
ఏండ్లుగా ఉద్యమం నుండి జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది ఆమె..ఒక మహిళ అని చూడకుండా పోలీస్ స్టేషన్ లో కూడా ఆమెపై దాడి చేయడం హేయమైన చర్య..ఇది ముమ్మాటికి వికృత చర్యనే..!! ఆమె చేసిన నేరం ఏంటి..? రైతులకు రుణమాఫీ ఎఃతవరకు వచ్చింది అని రైతులను అడగటానికి ముఖ్యమంత్రి గ్రామానికి వెల్లింది.. చుట్టుముట్టి పాడి చేయడం ఎంతవరకు సమంజసం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది సమంజసమా..? మీ అనుచరులు చేసిన దాడిని ఖచ్చింతగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే.. !! మొన్న కేటీఆర్ పొరపాటున మహిళల విషయంలో ఒక్కమాట అంటే వెంటనే స్పందించిన మహిళా కమీషన్ నేడు ఏకంగా మహిళా జర్నలిస్టులను చేజ్ చేసి పోలిస్ స్టేషన్ సాక్షిగా దాడికి యత్నిస్తూ దౌర్జన్యం చేస్తే ఎందుకు స్పందించటం లేదు..!!
ఇదే నా ప్రజాపాలన..దీనికి ఖచ్చితంగామూల్యం చెల్లించుకోకతప్పదు.. 8 నెలల్లోనే రాష్ట్రాన్ని రావణకాష్ట్రంగా మార్చారు..ఖచ్చితంగా మీకు కాలం సమాదానం చెబుతుంది. ఆడభిడ్డలు సరిత, విజయ ధైర్యంగా ఉండండి.