హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విశ్వం న్యూస్) : జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు టాలీవుడ్ హీరో నితిన్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
2020లో శాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కాగా నితిన్, శాలిని దంపతులకు సెప్టెంబర్ ఆరవ తారీఖున.. పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇక ఇదే విషయాన్ని తెలియజేశారు నితిన్. తమ కుటుంబంలోకి కొత్త స్టార్‌ను ఆహ్వానిస్తున్నామని తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు నితిన్ ఓ ఫొటోను ట్వీట్ చేశాడు.