ఈ విధంగా పత్రిక ప్రకటనలు
చేయడం సిగ్గుచేటు:
కొరివి అంజలి గణేష్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విశ్వం న్యూస్) : 13వ వార్డులో జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాలతి నాగరాజు వైఖరికి సంబంధించి కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పవచ్చు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు సమయానుసారం ప్రారంభోత్సవాలను నిర్వహించారు, అంతే కాకుండా 13వ వార్డులో కూడా నిర్ణయించిన సమయానికి చేరుకున్నారు. అయితే, స్థానిక కార్పొరేటర్ మాలతి నాగరాజు ఎమ్మెల్యే గారి కాన్వాయిని అడ్డగించి, తప్పుగా సమాచారం లేదని నిందించారు.
ఎమ్మెల్యే గారు వెళ్లిపోయిన తర్వాత, కార్పొరేటర్ మాలతి నాగరాజు అధికార పార్టీకి మరియు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా పత్రికలలో నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలపై స్థానిక నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ, కార్పొరేటర్ వైఖరిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.
నేను నీ మనిషినే అని చెప్పుకొని ఎమ్మెల్యే గారి ముందు మెప్పు పొంది, ఎమ్మెల్యే గారు అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత.. అధికార పార్టీకి మరియు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా బయటాయించి నిరసన తెలియజేస్తూ పత్రికలలో ప్రకటించడం గమనార్హం.
ఎమ్మెల్యే గారి ముందు ఒకలాగా ప్రవర్తిస్తూ ..వారి వెనుకాల సొంత లాభం కోసం పార్టీలో మెప్పు పొందడం కోసం, ఈ విధంగా పత్రిక ప్రకటనలు చేయడం సిగ్గుచేటు. ఇకనైనా 13వ నెంబర్ కార్పొరేటర్ మాలతి నాగరాజు తమ వైఖరిని మార్చుకొని, ఏదో ఒక వర్గం వైపు ఉంటే బాగుంటుందని స్థానిక నేతల అభిప్రాయం.