హరీష్ రావు అరెస్ట్.. భుజానికి గాయం

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విశ్వం న్యూస్) : తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీ ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వాళ్లదరినీ.. కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మరోవైపు.. అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో.. అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులపై బీఎన్ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

హరీష్ రావు భుజానికి గాయం
హరీష్ రావు ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఒక్కసారిగా రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులు మధ్య తోపులాట.. తోపులాటలో హరీష్ రావు భుజానికి గాయం

కాగా తమ పార్టీ నేత కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నేత అరికెపూడి గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే కోర్టుకు వెళ్తామంటూ హరీశ్ రావు సైబరాబాద్ సీపీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. అలాగే ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ అనుచరులతో కలిసి నినాదాలు చేశారు.

ఈ క్రమంలోనే సీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశంతో పోలీసులు హరీశ్ రావును, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *