ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి?

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. కూకట్‌పల్లి, అమీన్‌పూర్ ప్రాంతాల్లో కూల్చివేతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌ నగరంలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 22) కూకట్‌ పల్లి నల్లచెరువులోని ఆక్రమణలు అన్నీ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేస్తున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలుగా ఉండేదని.. ఇందులో ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్‌ జోన్‌లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు.

బఫర్‌ జోన్‌లోని నాలుగు ఎకరాల్లో దాదాపు 50కిపైగా పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్ మెంట్లు నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్‌లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే, భవనాల్లో నివాసం ఉంటున్నందున వాటి జోలుకు పోకుండా దాదాపు 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. కూల్చివేతలు జరుగుతున్నందున అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *