హైడ్రా బాధితులకు బాసటగా…

హైడ్రా బాధితులకు బాసటగా…

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విశ్వం న్యూస్) : మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైడ్రా కూల్చివేతలు పక్కదారి పట్టాయని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి కుటుంబీకులు తాము కూడబెట్టుకున్న సొమ్ముతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం, వారిని నిరాశ్రయులు చేయడం సరికాదని విమర్శించారు.

అభివృద్ధి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ఎలాంటి సర్వేలకు కూడా నిర్వాసితులు అంగీకరించవద్దని, కొత్తవారినెవరినీ తమ కాలనీల్లోకి రానివ్వొద్దని కోరారు. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో హెచ్ఎండీఏ ఎలా లేఅవుట్లు వేసిందంటూ ప్రశ్నించారు. అనంతరం వారందరూ మూసీ పరీవాహక కాలనీల్లో పర్యటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైడ్రా పనితీరునూ తప్పు పట్టారు. పేదల పొట్ట కొట్టవద్దంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన ప్రత్యేక బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, గుంగల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి సహా గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. బండ్లగూడ, హైదర్‌షాకోట్ ప్రాంతాల్లో వాళ్లు బాధితులను కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *