కన్నుల పండువగ
కార్తీకదీపోత్సవం
- శుభప్రదం.. కార్తీకమాసం
- పూజలు చేసిన భక్తులు
- దీపాలు వెలిగించి చీకట్లను పారదోలిన మహిళలు…
హైదరాబాద్, నవంబర్ 3 (విశ్వం న్యూస్) : కార్తీక మాసం సందర్భంగా మోతి నగర్ శివాలయం నందు చింతపల్లి వంశీ మోహన్ రెడ్డి, చింతపల్లి శోభా రెడ్డి కుటుంబ సమేతంగా డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి ప్రెసిడెంట్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్, మరియు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కమిటీ. మరియు గూడూరి బి.కె.విజయలక్ష్మి, సాయి కనిష్క, జి. శ్రీధర్ రెడ్డి కె. శ్రీలత, డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ బ్రాహ్మణుల చేత ఘనంగా పూజా కార్యక్రమాలు జరిపించి దీపియోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆంజనేయుల గుడిలోని దీపస్తంభపైన, కుమారి లీషా వంశీ రెడ్డి గారి ద్వారా పూజా కార్యక్రమం నిర్వహించడం ఎంతో మధురమైన విషయమైంది. ఈ విధమైన కార్యక్రమాలు దేవాలయ శ్రేయస్సుకు, భక్తుల ఆత్మశాంతికి మరియు సమాజానికి ఎంతో అందిస్తాయి. పూజా కార్యక్రమంలో ప్రాముఖ్యత ఉన్న విధానాలు, హోమాలు, అర్చనలు, మరియు ఇతర రీతులు యందు పాల్గొనడం ద్వారా సనాతన ధర్మం అనుభూతి చెందవచ్చు. ఇది భక్తి, శాంతి మరియు శ్రద్ధను పంచుకునే అవకాశం కల్పిస్తుంది.
కార్తీకదీపోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. కాబట్టి ఈ నెలలో పుష్కరిణిలో స్నానం చేసి శివుడిని దర్శించుకుంటారు.
బిల్వ పత్రాల (మారేడు ఆకులు)తో శివుడికి అర్చన చేసి, దీపాలు వెలిగిస్తే అన్ని శుభాలే జరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు కృష్ణా నదిని తల్లిగా భావించి దీపదానం చేయడమే కాకుండా పసుపు కుంకుమ, చీర, సారెలు సమర్పిస్తారు.
ఈ కార్యక్రములో మాస్టర్ డాన్సర్ వన్ రాజు రెడ్డి, కమిటీ సభ్యులు డి. రవి గౌడ్, డి. రాధిక తదితరులు పాల్గొన్నారు.