సీనియర్ నటి జమున కన్నుమూత

హైదరాబాద్, జనవరి 27 (విశ్వం న్యూస్) : సీనియర్ నటి జమున(86) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఆరోగ్యం విషమించడంతో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు. ‘మూగమనసులు’ చిత్రంలో నటనకు 1964లో జమునకు ఫిలింఫేర్ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. మరలా 1968లో అదే గౌరి పాత్రను హిందీ ‘మిలన్’ చిత్రంలో జమున పోషించింది. అందులో నటనకు కూడా ఆమెకు మరొకసారి ఫిలింఫేర్ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. 2008లో యన్.టి.ఆర్ జాతీయ పురస్కారం అందుకుంది.
