కేసిఆర్ అధ్యక్షతన 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్, జనవరి 27 (విశ్వం న్యూస్) : ఈ నెల 29న ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సీఎం కేసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.