జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్, జనవరి 27 (విశ్వం న్యూస్) : డిసిసి అధ్యక్షులు డా.కవ్వం పల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారికి వినతి పత్రం అందజేసిన అనంతరం వీడియో ప్రతినిధులతో మాట్లాడుతూ నిన్న తేదీ. 26 జనవరి 2023న మానకొండూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఎంపీపీ ముద్దసాని సులోచన గారు అధికారులతో సమావేశమైన సందర్భంగా సమావేశానికి అనుమతి లేకున్నప్పటికీ అక్కడికి వచ్చిన ఎంపీపీ గారి భర్త ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి గారు పంచాయతీరాజ్ ఏఈ తిరుపతి గారి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వాటర్ బాటిల్ ను ఏఈ గారిపై విసిరి వేస్తూ దాడికి ప్రయత్నించినారు.

ఈ సంఘటన పట్ల సమావేశంలో సమావేశానికి హాజరైన ఇతర అధికారుల ముందు అవమానానికి గురైన దళితుడు, పంచాయతీ రాజ్ ఏఈ తిరుపతి గారు తీవ్ర మనస్తాపంతో కంటతడి పెట్టుకున్నారు. ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక గౌరవమైన ప్రభుత్వ అధికారి హోదాలో ఉన్న ఏఈ గారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ వారి హోదాను కించపరిచే విధంగా దాడి చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొకసారి ఈ విధంగా ప్రభుత్వ అధికారులపై ఎవరు దాడికి పాల్పడకుండా ఉండేందుకుగాను తక్షణమే ఎంపీపీ ముద్దసాని సులోచన గారి భర్త ఆయన ముద్ధసాన్ని శ్రీనివాస్ రెడ్డి గారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలగకుండా దోహదపడగలరని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి అందజేసిన వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్ర చారి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు నాగి శేఖర్, గడ్డం విలాస్ రెడ్డి, ఓదయ్య కొత్తకొండ శంకర్, గసికంటి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *