చైల్డ్ గైన్ సెంటర్లో మానసిక అంగవైకల్యం పిల్లల మధ్య గణతంత్ర వేడుకలు

చైల్డ్ గైన్ సెంటర్లో మానసిక అంగవైకల్యం పిల్లల మధ్య గణతంత్ర వేడుకలు

పీర్జాదిగూడ, జనవరి 27 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ గణేష్ నగర్ చైల్డ్ గైడెన్స్ సెంటర్ మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లల మధ్య 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు పురస్కరించుకొని సి జి సి సెంటర్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం సీజిసీ ప్రధాన కార్యదర్శి ఎం జానీ రోజ్ కుమారి, సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిజిసి సెంటర్లో మానసిక అంగ వైకల్యం కలిగిన పిల్లలు తల్లిదండ్రుల మధ్య 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిజిసి సెంటర్ స్టాప్ సిబ్బంది పిల్లలు తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *