బీఎస్పీ రాష్ట్ర ఈసీ సమావేశం
బోడుప్పల్, జనవరి 29 (విశ్వం న్యూస్) : రాష్ట్ర కార్యాలయంలో EC సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు (MP) రాంజీ గౌతమ్ సాబ్ పాల్గోని, రానున్న ఎన్నికల్లో BSP నాయకులు, కార్యకర్తలు దూకుడు పెంచాలని, వచ్చే నెల నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి, అసెంబ్లీల వారిగా పర్యటిస్తానని తెలియజేశారు. రాష్ట్ర, జిల్లా నాయకత్వం అంత క్షేత్ర స్థాయి లోకి వెళ్ళి పని చేయాలనీ ఆదేశించారు.
అనంతరం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ మంద ప్రభాకర్ అన్న, కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్న,రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానంద్ రావు అన్న, రాష్ట్ర జనరల్ సెక్రటరీలు, సెక్రెటరీ లు, మహిళా నాయకురాలు, జిల్లా ఇంఛార్జి లు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.