
- గెట్‌టుగెదర్ పార్టీ నుంచి గాథ మొదలైంది!
అమీన్‌పూర్, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్‌లో ఇటీవల జరిగిన తల్లి చేతుల మీదుగా ముగ్గురు పసికందుల హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ కేసులో మరింత కలకలం రేపిన విషయం – బాధితురాలి భర్త చెన్నయ్య చేసిన వ్యాఖ్యలు.

“ఆమె నన్ను నమ్మించి గొంతు కోసింది.. పిల్లల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది.. కానీ నేను పిల్లల్ని కన్న తండ్రిగా గుండెల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వాళ్లను చంపేసి కనీసం శ్రమించలేదు కూడా. ఆమెను, శివను ఎన్‌కౌంటర్ చేయాలి!” అని కన్నీళ్లతో చెన్నయ్య వాపోయాడు.
చెన్నయ్య నీటి ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య రజిత (లావణ్యగా కూడా పిలవబడేది) ప్రైవేట్ టీచర్. పదవతరగతి గెట్ టు గెదర్ పార్టీలో శివ అనే క్లాస్మేట్‌తో ఆమె పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ బంధం ఆమెను ఆలోచించని దారికి తీసుకెళ్లింది –చివరకు తనే పుట్టించిన పిల్లల్ని హత్య చేయడం వరకూ వెళ్లింది.
సామాజిక భద్రతపై ప్రశ్నలు..!
ఇలాంటి సంఘటనలు సమాజంలోని మానవ సంబంధాల మైనింగ్‌ను బయటపెడుతున్నాయి. ప్రేమ, నమ్మకం, బాధ్యత అనే విలువలు ఎంతగా పతనమవుతున్నాయో మనల్ని ఆలోచించనిచేస్తున్నాయి. ఈ ఘటన కేవలం ఒక కుట్ర కాదే.. ఓ తల్లితనం, ఓ కుటుంబం పతనమైన కథ.