జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యం
తిమ్మాపూర్, ఫిబ్రవరి 1 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దురిశెట్టి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక కరీంనగర్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ ప్రకాష్. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన సీనియర్ జర్నలిస్టు మహేందర్ రెడ్డి కుటుంబానికి పత్రికా యాజమాన్యం తరఫున రూ. 5 లక్షల రూపాయలు చెక్కును వారి భవిష్యత్తు, కుటుంబ అవసరాల కోసం ఆయన తల్లి దండ్రులు నారాయణరెడ్డి,ఎల్లవ్వ దంపతులకు బుధవారం ఎడిషన్ కార్యాలయంలో బ్యూరో, బీఎం ప్రకాష్ అందజేశారు. ఈ సందర్భంగా పత్రిక యాజ మాన్యం, ఎడిటర్, నెట్వర్క్, బ్యూరో, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.