కేటీఆర్ పర్యటనలో NSUIనాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూన్నాము:బల్మూరి వెంకట్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విశ్వం న్యూస్) : బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ప్రెస్ మీట్ హాజరైన పత్రిక విలేకరులకు, మీడియా సోదరులకు, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్లు అన్ని విభాగల సంబంధించిన హాజరు కావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కల్వకుంట్ల తారక రామారావు గారు వస్తున్నారు అంటే హుజురాబాద్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి ఫలాలను ఇస్తారు ఎన్నో కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని ఎదురు చూస్తే మా ఆశ నిరాశగా మిగిలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాటినే మళ్లీ రిబ్బన్ కట్ చేయడం ప్రజల్ని మోసం చేయడం తప్ప వేరే ఏమీ లేదని నేను భావిస్తున్నాను. కమలాపూర్ మండలంలో డిగ్రీ కాలేజ్ కి కేటాయించిన స్థలాన్ని టిఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేస్తున్న, ఈ అంశంపైన కేటీఆర్ గారికి వినతిపత్రం అందజేయడానికి మా కార్యకర్తలు ట్రై చేస్తే కనీసం కల్వనియకుండా అనుమతించకపోవడం వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం దారుణం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున చుట్టుపక్క గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, చెన్నై పటేల్, రవీందర్, దేశం ఐలయ్య, నారాయణరెడ్డి, భగవాన్ రెడ్డి, సలీం భాయ్, సాయిబు హుస్సేన్, అప్సర్ భాయ్, ఇమ్రాన్, శ్రీనివాస్, ప్రణవ్, సుంకరి రమేష్, విష్ణు దాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.