టాలీవుడ్‌లో మరో విషాదం… ఫిష్ వెంకట్ కన్నుమూత

హైదరాబాద్, జూలై 19 (విశ్వం న్యూస్):
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారన్న వార్తలు తెలుగు ప్రేక్షకులను కలచివేశాయి. ఇప్పుడు ఆ బాధ మరవకముందే, మరో ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కూడా తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వెంకట్, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. అవసరమైన సమయంలో డబ్బులు, కిడ్నీ అందకపోవడం ఈ విషాదాన్ని మరింత భరించలేనిదిగా మారింది.
వెంకట్ నటించిన ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్, నెగిటివ్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న తీరు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటుంది. “ఫిష్ వెంకట్” అనే పేరే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.
ఈ అకాల మరణం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.