ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చామంతి నరేష్

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను
ప్రారంభించిన చామంతి నరేష్

సూర్యాపేట/నాగారం, అక్టోబర్‌ 27 (విశ్వం న్యూస్‌) : నాగారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వర్ధమానుకోట, శాంతినగర్ గ్రామాలలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. సెంటర్ల వద్ద రైతుల సౌకర్యార్థం కనీస వసతులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎం పొన్నం వెంకన్న, ఏఈఓ సంధ్య, నాయకులు ఆకుల బుచ్చిబాబు, ఇంద్రసేనారెడ్డి, ఎలమకంటి సోమయ్య, బండ గొర్ల జనార్ధన్, కన్నెబోయిన వెంకట భిక్షం, కండె అంజయ్య, సైదులు, వలి జాని హుస్సేన్, నిర్వాహకులు పాల్వాయి సైదమ్మ, కడియం విజయలక్ష్మి, మేడి సరిత, వడ్డే రేణుక, మల్లెపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *