శివలింగ మాక్స్‌ సొసైటీ రద్దు చేయాలని రైతుల డిమాండ్‌

శివలింగ మాక్స్‌ సొసైటీ రద్దు చేయాలని రైతుల డిమాండ్‌

నాగారం, అక్టోబర్‌ 28 (విశ్వం న్యూస్‌) : నాగారం మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ రైతులు తమ గ్రామంలో ఉన్న శివలింగ మాక్స్‌ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసిల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, తహసిల్దార్‌ కిషోర్‌ శర్మకు వినతి పత్రం అందజేశారు.

రైతులు మాట్లాడుతూ — గతంలో శివలింగ సొసైటీ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహించిన సమయంలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు, రైతులను మోసం చేసి సుమారు 143 క్వింటాళ్ల ధాన్యం కాజేశారని ఆరోపించారు. సొసైటీని రద్దు చేయకపోతే ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతులు యానాల సుధాకర్‌ రెడ్డి, తొక్కని సోమేశ్వర్‌ రెడ్డి, నరసింహ రెడ్డి, సంపేట కృష్ణమూర్తి, దేవరకొండ వెంకన్న, దేవరకొండ యాదగిరి, నాతి ఉప్పలయ్య, కాసం వీరయ్య, వేర్పుల గట్టయ్య, జీవో వీరాచారి, కొండా నాగరాజు, కూతటి పెదలింగయ్య, కడారి సైదులు, కూతటి లింగయ్య, పెరుమాల జానీ, తుక్కాను లింగారెడ్డి, గైగుళ్ల సోమయ్య, ఉపసర్పంచ్‌ పెరుమాల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *