గజిటెడ్ హోదా సాధనకు కృషి చేసిన అధికారికి ఘన సన్మానం

హుజరాబాద్ పట్టణంలోని జామే మజీద్ ఆవరణలో బుధవారం జరిగిన మజీద్ కమిటీ సమావేశంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ స్టేట్ టాక్స్ అధికారి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గజిటెడ్ హోదా పొందిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జామే మజీద్ కమిటీ నాయకులు మహమ్మద్ హబీబ్, మహమ్మద్ రఫీక్, మున్ను, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ అజ్మతుల్లా, మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ హర్షత్, మహమ్మద్ అబ్దుల్ జమీల్, మహమ్మద్ యాసిన్ ఖాన్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జామే మజీద్ ఇమామ్ మహమ్మద్ షాకీర్, నాయబ్ ఇమామ్ మహమ్మద్ అబ్దుల్ ఫహీమ్, ఖలీద్ ఖాజా, అలీ అహ్మద్, మహమ్మద్ అఫ్జల్, మహమ్మద్ అబ్జాద్ అలీ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గజిటెడ్ హోదా సాధన కోసం దాదాపు పది సంవత్సరాలుగా పోరాటం కొనసాగిందని తెలిపారు. మొత్తం 537 మంది ఏసీటీవోలకు గజిటెడ్ హోదా రావడానికి తాము కృషి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని మజీద్ కమిటీ నాయకులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్‌ను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.