వరాల నర్సింగంపై అనర్హత పిటిషన్

వరాల నర్సింగంపై అనర్హత పిటిషన్

విశ్వం న్యూస్/కరీంనగర్, ఏప్రిల్ 16:
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నర్సింగంపై అనర్హత పిటిషన్ దాఖలైంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన నర్సింగంపై, సమీప ప్రత్యర్థి కొండపల్లి సతీష్ (బీజేపీ) జిల్లా ప్రిన్సిపల్ కోర్టు, ఎలక్షన్ ట్రిబ్యునల్ సెషన్స్ జడ్జి ఎదుట పిటిషన్ దాఖలు చేశారు.

గత మార్చి 9న ఎలక్షన్ ఓపీ నం.03/2026 కింద అడ్వకేట్ పురాణం సందీప్ కుమార్ ఈ పిటిషన్‌ను సమర్పించారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించడం చట్ట విరుద్ధమని, వరాల నర్సింగం కరీంనగర్ నగరపాలక సంస్థ 21వ డివిజన్‌తో పాటు చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం మల్లాపూర్‌లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వరాల నర్సింగంను అనర్హుడిగా ప్రకటించి, రెండవ స్థానంలో నిలిచిన కొండపల్లి సతీష్‌ను విజేతగా ప్రకటించాలని కోరారు.

గురువారం జరిగిన విచారణలో కోర్టు తదుపరి విచారణను జూన్ 10, 2026కు వాయిదా వేసినట్లు కొండపల్లి సతీష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *