గజిటెడ్ హోదా జీవో–79 అందజేత

గజిటెడ్ హోదా
జీవో–79 అందజేత

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌లోని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం చీఫ్ కమిషనర్ ఎం. రఘునందన్ రావు, టీసీటీ ఎన్‌జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్‌కు గజిటెడ్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవో ఎంఎస్–79 ప్రోసిడింగ్ కాపీని అందజేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న 537 ఏసీటీఓలకు గజిటెడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్–79ను జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమైంది.

ఈ సందర్భంగా సంఘం నాయకులు సీనియర్ అసిస్టెంట్లకు వెంటనే ఏసీటీఓ ప్రమోషన్లు కల్పించాలని, అలాగే జూనియర్ మరియు సీనియర్ అసిస్టెంట్లు దాదాపు ఎనిమిదేళ్లుగా బదిలీలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో పలువురు ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, వెంటనే బదిలీలు చేపట్టాలని అధికారులను కోరారు. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ ఉద్యోగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ను ప్రమోషన్లలో అమలు చేయాలని, అందుకు అవసరమైన సర్వీస్ రూల్స్ సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ సంఘం ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని చీఫ్ కమిషనర్ ఎం. రఘునందన్ రావు హామీ ఇచ్చారు. శాఖలోని అన్ని కేటగిరీల ఉద్యోగుల సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి ప్రమోషన్లకు మార్గం సుగమం చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఎం. రఘునందన్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తున్నారని, ఏసీటీఓ నుంచి డీసీటీఓ, తదుపరి అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలకు ప్రమోషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కార్యక్రమంలో జి. ప్రభాకర్, పి. ప్రవీణ్ కుమార్, జి. శ్రీనివాస్, ఎం. విక్టర్ పాల్, మహమ్మద్ ముజీబ్, గోపి, హరికృష్ణ, సాయి కృష్ణ, సుదర్శన్ గౌడ్, మహమ్మద్ సలావుద్దీన్, కుదురత్, ఎంఎస్ మూర్తి, మహమ్మద్ హబీబ్, మమత, కృష్ణవేణి, శ్రీవాణి, రెహనా, రాజేశ్వరరావు, మహమ్మద్ అహమ్మద్, శర్మ, శామీర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *