నిరుద్యోగులను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్
గోవిందరావుపేట, ఫిబ్రవరి 7 (విశ్వం న్యూస్) : నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ విమర్శించారు. మంగళవారం పస్రా గ్రామంలో 109 సర్వే నెంబర్లు గుడిసెలు నిర్మించుకున్న నిరుపేదలకు ఆయన సంఘీభావం తెలిపారు . అనంతరం పీఎస్ఆర్ గార్డెన్ లొ డివైఎఫ్ఐ మండల విస్తృత స్థాయ సమావేశం బి సంజీవ అధ్యక్షతన జరిగింది. అనంతరం అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచిన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది కేంద్రంలో మూతపడ్డాయని డిగ్రీలో పీజీలు చేసిన నిరుద్యోగ యువత ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసి పోస్టల్ రైల్వే ఎయిర్పోర్ట్ తదితర రంగాలను ప్రైవేటీకరణ చేసి అంబానీ ఆదానిలకు దోచిపెట్టిందని మండిపడ్డారు. దేశంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ యువతను పెడతోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జుట్టబోయిన రమేష్, పల్లపు రాజు, జక్కువేను, సాదు శీను, ఉదయ్, జ్యోతి, కారం రజిత, రేణుక, కందుల శ్రావణ్, పి అరుణ్, బత్తుల సాయికుమార్, సాంబ, మణికంఠ, రాజేష్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.