భద్రకాళి అమ్మవారిని
దర్శించిన కేటీఆర్

వరంగల్, మే 6 (విశ్వం న్యూస్): వరంగల్ నగరంలోని ప్రసిద్ధ పవిత్రక్షేత్రం భద్రకాళి ఆలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న కేటీఆర్‌కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సమాచారం.


కేటీఆర్ దర్శనం నేపథ్యంలో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
