హైదర్‌షాకోట్ బాధితులకు కేటీఆర్ అండ

హైదర్‌షాకోట్
బాధితులకు
కేటీఆర్ అండ

హైదర్‌షాకోట్/ హైదరాబాద్, జూలై 11 (విశ్వం న్యూస్) : బఫర్ జోన్ పేరుతో ఇళ్ల కూల్చివేతకు HMDA అధికారులు మార్కింగ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న హైదర్‌షాకోట్ ప్రజలు శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

బఫర్ జోన్ పేరుతో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడానికి అధికారులు గుర్తులు వేస్తున్నారని, వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

బాధితుల సమస్యలను విన్న కేటీఆర్, ప్రజల ఇళ్ల కూల్చివేతకు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకమని, బాధిత కుటుంబాలకు అండగా నిలిచి అన్ని స్థాయిల్లో పోరాడి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమ పోరాటానికి బలం చేకూరిందని హైదర్‌షాకోట్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *