3 గంటల పాటు పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

  • కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స.. మరో భుజానికి రెండు నెలల్లో ఆపరేషన్

ముంబై, జూలై 11: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ఉదయం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉండటంతో వైద్యుల సూచన మేరకు ముందుగా కుడి భుజానికి శస్త్రచికిత్స చేపట్టారు.

సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైనట్లు వైద్యులు తెలిపారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స నిర్వహిస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, దశలవారీగా చికిత్స చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుడి భుజానికి మాత్రమే శస్త్రచికిత్స నిర్వహించగా, ఎడమ భుజానికి మరో రెండు నెలల వ్యవధిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *