మంత్రి హోదాపై బల్మూర్ వెంకట్‌కు శుభాకాంక్షలు

- కమలాపూర్ కాంగ్రెస్ నాయకుల మర్యాదపూర్వక భేటీ
హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర మంత్రి హోదా లభించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్‌ను కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్ బల్మూర్ వెంకట్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా శ్రమించారని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన చేసిన సేవలు, ప్రజలతో మమేకమై పనిచేసిన తీరు ప్రశంసనీయమని కొనియాడారు.
మంత్రి హోదా రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వారు, భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత ముందుండి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.