ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తిమ్మాపూర్, జులై 14 : మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై రాజేందర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనపై తప్పుడు కేసులు నమోదు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *