కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన
కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన

హైదరాబాద్, సెప్టెంబర్ 3 : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు పంపినట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన స్థానంలో తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మిని నియమించింది.

అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణి నియామకానికి కూడా ఆమోదం లభించింది.

ఒకేసారి పలు కీలక పదవుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.