పెన్షన్ విధానంపై ఉద్యోగుల నిరసన

పెన్షన్ విధానంపై ఉద్యోగుల నిరసన

పెన్షన్ విధానంపై ఉద్యోగుల నిరసన

విశ్వం న్యూస్/తిమ్మాపూర్, సెప్టెంబర్ 1: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఉద్యోగులు నిరసన చేపట్టారు. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు టీఎన్‌జీవో, టీజీవో, నాలుగో తరగతి ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1ను ‘పెన్షన్ విద్రోహ దినం’గా పాటించారు.

ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతబట్టి సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షుడు పోలు కిషన్ మాట్లాడుతూ సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అలాగే పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర సమస్యలను ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర నాయకులు మామిడి రమేష్, ఎన్టీపీఏ సంఘం ప్రధాన కార్యదర్శి రామచంద్రరెడ్డి, కోశాధికారి అశోక్‌రెడ్డి పుప్పాల, జిల్లా నాయకులు జి.రమేష్, ప్రసాద్‌రెడ్డి, సరిత, కరుణ, అజ్గర్, కె.శ్రీను, ఎం.డి. ఖలీల్‌ఖాన్, నాలుగో తరగతి సంఘం కేంద్ర సంఘం ఎల్‌ఎండీ యూనిట్ అధ్యక్షుడు బుర్ర రాజయ్య, కార్యదర్శి చిర్ర రాజయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు నారాయణ, శాంతికుమార్ తదితరులతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *