ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదు

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదు

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదు

విశ్వం న్యూస్ / కరీంనగర్, సెప్టెంబర్ 30:
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ అనివార్యమని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ గోపాల్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని వి కన్ఫర్మేషన్ హాల్‌లో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి ముప్పిడి శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కమిషనర్ గోపాల్ హాజరై శ్రీనివాస్‌ను సన్మానించారు.

తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ముప్పిడి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా ఎదిగి 36 సంవత్సరాల పాటు నీతి, నిజాయితీతో ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించడం అభినందనీయమన్నారు.

డీసీటీఓ ఎం. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకున్నారని పేర్కొన్నారు.

అసోసియేట్ అధ్యక్షులు జి. ప్రభాకర్ మాట్లాడుతూ, శ్రీనివాస్ ఏ ప్రాంతంలో పనిచేసినా ఉద్యోగులు, వ్యాపారులతో స్నేహపూర్వకంగా మెలిగేవారని అన్నారు. ఉపాధ్యక్షులు జి. భిక్షపతి మాట్లాడుతూ, ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుకున్న శ్రీనివాస్ పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

పెద్దపల్లి సీటీఓ హరిచరణ్, జగిత్యాల సీటీఓ కవిత, సిరిసిల్ల సీటీఓ రాజేందర్, కరీంనగర్ సీటీఓలు సత్యనారాయణమూర్తి, వైష్ణవి తదితరులు శ్రీనివాస్ సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ నాయకులు జి. శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, ఎం. జగన్ మోహన్ రెడ్డి, డివిజన్ సంఘ నాయకులు మహమ్మద్ సలావుద్దీన్, శంకర్, మహమ్మద్ అబ్దుల్ బారి, సునీత, మేనేజర్ హేమలత, పదవీ విరమణ పొందిన ఉద్యోగ సంఘ నాయకులు యు. రామస్వామి, డబ్బా సత్యనారాయణ, ఏ. సత్తయ్య, పూర్ణచందర్, భగవాన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు బంధువులు, మిత్రులు, ఆడిటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *