40 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

40 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

40 ఏళ్ల సేవలకు
ఘన వీడ్కోలు

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, సెప్టెంబర్ 30: ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో సుమారు 40 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన పసుల రాములు పదవీ విరమణ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని ఇరిగేషన్ శాఖ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దంపతులకు ఘన సత్కారం : పదవీ విరమణ పొందిన పసుల రాములు, ఆయన సతీమణి లక్ష్మీ దంపతులను అధికారులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలు, బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.

సేవలు చిరస్మరణీయం : కార్యక్రమానికి క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్, సర్కిల్-2 సూపరింటెండెంట్ ఇంజనీర్ మిట్టపల్లి రమేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.హెచ్. శ్రీనివాస్, డీఈలు రామకృష్ణ, సత్యనారాయణ తదితర అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పనిసరి అయినప్పటికీ, విధుల్లో అందించిన సేవలు, చేసిన మంచి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పసుల రాములు 40 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి శాఖకు సేవలందించారని కొనియాడారు. ఆయన సేవలకు గౌరవంగా ఈ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

పెద్ద ఎత్తున హాజరు : ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, సిబ్బంది, పసుల రాములు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *