మూడవ వేతన కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి

మూడవ వేతన కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి

మూడవ వేతన కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి

కరీంనగర్, అక్టోబర్ 1, విశ్వం న్యూస్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ భవన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు థర్నా నిర్వహించారు. AUAB బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ఐక్య వేదిక కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మూడవ వేతన కమిటీ సిఫార్సులను 01.01.2017 నుంచి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

AUAB నాయకులు సత్యం, లింగాచారి నాయకత్వంలో అధిక సంఖ్యలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు థర్నాలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మూడవ వేతన కమిటీ సిఫార్సులను ఆలస్యం చేయకుండా అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు.

ఉద్యోగుల డిమాండ్లకు మద్దతుగా బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్లు కూడా థర్నాలో పాల్గొన్నారు. పెన్షనర్ల ప్రతినిధి చెన్నమనేని వేణుగోపాలరావు నాయకత్వంలో జిల్లాలోని పలువురు పెన్షనర్లు కార్యక్రమానికి హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *