అనంతగిరిలో లోయలో పడిన ప్రైవేట్ బస్సు-ముగ్గురు మృతి

అనంతగిరిలో లోయలో పడిన ప్రైవేట్ బస్సు-ముగ్గురు మృతి

ముగ్గురు మృతి

అక్టోబర్ 3, విశ్వం న్యూస్: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేసారం నుంచి చింతకుంటకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *