ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో
తల్లి ఆత్మహత్య

  • వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలో విషాద ఘటన

విశ్వం న్యూస్: వికారాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి, అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన ధారూరు మండలం చింతకుంటలో శనివారం జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన వాసవి రెడ్డి (32), భూపతి రెడ్డి దంపతులకు సహస్ర రెడ్డి (7), వేదాన్ష్ రెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భూపతి రెడ్డి లెక్చరర్‌గా పనిచేస్తుండగా, ఈ కుటుంబం కొంతకాలంగా వికారాబాద్‌లో నివాసం ఉంటోంది.

శనివారం వాసవి తన ఇద్దరు కుమారులతో కలిసి చింతకుంటలోని ఇంటికి వచ్చింది. ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఉరివేసిన అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వాసవి కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై సురేశ్‌ తెలిపారు. ఘటనకు గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *