ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డా. జగన్ మోహన్ రావు

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డా. జగన్ మోహన్ రావు

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డా. జగన్ మోహన్ రావు

కరీంనగర్, అక్టోబర్ 26 (విశ్వం న్యూస్): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జగన్ మోహన్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ పోలస రామ్ కిరణ్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ఐఎంఏ భవనంలో నిర్వహించిన రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికల్లో డాక్టర్ జగన్ మోహన్ రావు తన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించగా, డాక్టర్ పోలస రామ్ కిరణ్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాష్ట్ర కమిటీలోని ఇతర కార్యనిర్వాహక పదవులకు డాక్టర్ కె. శ్యామ్ సుందర్, డాక్టర్ కె. రాజేశ్వర్, డాక్టర్ మిన్ రెడ్డి, డాక్టర్ అలీమ్, డాక్టర్ జి. వెంకటరెడ్డి, డాక్టర్ ఎ. శైలజ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు డాక్టర్ జగన్ మోహన్ రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ పోలస రామ్ కిరణ్ మాట్లాడుతూ, ఐఎంఏ సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

వారి ఎన్నిక పట్ల వైద్య, వ్యాపార రంగాలతో పాటు వివిధ వృత్తిపరమైన, సామాజిక సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *