గురుకుల విద్యార్థులకు ‘కుక్కపేగు’ గుడ్డలా? చేనేత కార్మికుల పొట్టకొడుతున్న సీఎం!

గురుకుల విద్యార్థులకు ‘కుక్కపేగు’ గుడ్డలా? చేనేత కార్మికుల పొట్టకొడుతున్న సీఎం!

గురుకుల విద్యార్థులకు ‘కుక్కపేగు’ గుడ్డలా? చేనేత కార్మికుల పొట్టకొడుతున్న సీఎం!

  • రీసైకిల్డ్ వస్తువుల సరఫరాలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ
  • చేనేత కార్మికులకు టెండర్లు దక్కకుండా గుజరాత్ కంపెనీలకు ప్రాధాన్యం
  • హైకోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ
  • పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మండిపాటు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

విశ్వం న్యూస్, హైదరాబాద్, 7 నవంబర్ 2026 : తెలంగాణలో ప్రజాస్వామ్య పాలనకు బదులుగా పోలీస్ రాజ్యం కొనసాగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, గురుకుల విద్యార్థుల సంక్షేమం నుంచి చేనేత కార్మికుల ఉపాధి వరకు అనేక అంశాల్లో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ నేత రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కేసులతో వేధింపులు : పేదింటి బిడ్డ, విద్యార్థి ఉద్యమ నాయకుడు, మాజీ షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ప్రయత్నించారని శ్రవణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ లీగల్ టీం న్యాయపోరాటం చేయడంతో ఆయనకు బెయిల్ లభించిందన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు.

గురుకుల బెడ్‌షీట్లలో రూ.100 కోట్ల కుంభకోణం? : గురుకుల విద్యార్థులకు సరఫరా చేస్తున్న బెడ్‌షీట్లు, ఇతర వసతి సామగ్రి కొనుగోళ్లలో భారీ అవినీతి జరుగుతోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నాణ్యమైన చేనేత కార్పెట్లు, బెడ్‌షీట్లను పక్కనపెట్టి గుజరాత్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీల ద్వారా రీసైకిల్ చేసిన నాసిరకం వస్త్రాలను సరఫరా చేస్తున్నారని విమర్శించారు. సుమారు రూ.150 విలువ చేసే వస్తువులను రూ.400కు పైగా ధరలకు కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో రూ.100 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

సీఎం రేవంత్‌కు సూటి ప్రశ్న : నాసిరకం రీసైకిల్డ్ వస్త్రాలతో తయారుచేసిన బెడ్‌షీట్లు, దుప్పట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడికి కప్పుతారా? అని శ్రవణ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఇంద్రభవనాలు, పట్టు తివాచీలు కావాలని, పేద గురుకుల విద్యార్థులకు మాత్రం నాణ్యమైన కాటన్ బెడ్‌షీట్లు కూడా అందించలేరా అని నిలదీశారు. అసెంబ్లీ స్పీకర్ ధరించే ఖరీదైన కోట్ తరహా వస్త్రాలను విద్యార్థులకు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

చేనేత కార్మికులకు అన్యాయం : టెస్కో (TSCO) ద్వారా చేనేత కార్మికులకు దక్కాల్సిన టెండర్లలో కోత విధించి, వాటిలో కొంత భాగాన్ని గుజరాత్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే 54 మంది చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల గుత్తేదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం పేరుతో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు సవ్యసాచి ఘోష్ తదితరులు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఏక్తా మాల్ భూములపై ఆరోపణలు : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.200 కోట్ల విలువైన ఏక్తా మాల్ ప్రాజెక్టు విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని శ్రవణ్ ఆరోపించారు. లెదర్ లిట్ క్యాప్ సమీపంలోని 6.5 ఎకరాల భూమిని అపర్ణ, వంశీరామ్ బిల్డర్లకు అప్పగించి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి బీఆర్ఎస్ డిమాండ్లు : హైకోర్టు తీర్పు ప్రకారం రాబోయే టెండర్లన్నింటినీ టెస్కో (TSCO) ద్వారానే నిర్వహించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన చేనేత కార్పెట్లు, బెడ్‌షీట్లు మాత్రమే సరఫరా చేయాలని కోరారు. సెంట్రలైజ్డ్ పీఎంయూ ప్రొక్యూర్మెంట్ పేరుతో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *