ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు పట్టాలివ్వాలి

ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు పట్టాలివ్వాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి
గోవిందరావుపేట, ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : గోవిందరావుపేట మండలం పసరలో ఆదివారం గుడిసె వాసుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని దీనికి నిదర్శనం 109 సర్వే నెంబర్ అని పేర్కొన్నారు. 109 సర్వే నెంబర్లు రెవెన్యూ రికార్డుల లో ప్రభుత్వ భూమి పేరుతో రికార్డు ఉన్నదని అది కొంత మంది రైతులకు కౌలుకు తీసుకున్నట్టు పేర్కొన్నారు. కానీ ఆ భూములు వారాధీనంలో లేవు. ఆ భూములు కూడా వారు అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు గుడిసెలు వేసుకున్నభూమి కూడా గతంలో ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం జూన్ 2022న పేర్కొన్న, రెవెన్యూ అధికారులు స్వాధీనపరచుకోవడంలో విఫలం కావడం జరిగిందని ఆరోపించారు. 109 సర్వే నెంబర్లు కొంతమంది భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో సిపిఎం పార్టీ పేదల ను సమీకరించి గుడిసెలు వేసిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ రెవెన్యూ అధికారులు ఈ భూమిలో అక్రమ పట్టా ఇచ్చిన కృష్ణారెడ్డికి ఈ భూమి మీద హక్కు ఉన్నాయని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం అక్రమ పట్టా రద్దు చేయాలని పేదలేసుకున్నగుడిసెలకు పట్టాలివాళ్ళని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆదిరెడ్డి, సంజీవ, జిట్టబోయిన రమేష్, శారద, సువర్ణ రాజేశ్వరి, సరిత, సోహెల్, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *