ఉప్పల్ డిపో యుక్త హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ సక్సెస్
- డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ సుదర్శన్ రెడ్డి తదితరల కృషి
- హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పిన శివయ్య
- ఎల్పీజే సర్జరీ సక్సస్ పట్ల గుజ్జ సత్యం, రాగిడి లక్ష్మారెడ్డి హర్షం
పీర్జాదిగూడ, పిబ్రవరి 27 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ డిపో సమీపంలో ఉన్నటువంటి యుక్త హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఈసందర్భంగా వివరాల్లోకి వెళితే జహీరాబాద్ నివాసులు శివయ్య అనే పేషెంట్ ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో అతని ఆరోగ్య సమస్య చెప్పడంతో కొన్ని లక్షల రూపాయలతో కూడుకున్న ఆపరేషన్ అని చెప్పడంతోని నిరుపేద అయిన శివయ్య బీసీ సంక్షేమ జాతీయ ఉపాధ్యక్షులైన గుజ్జ సత్యంని కలవడంతో.. వెంటనే స్పందించిన గుజ్జ సత్యం యుక్త హాస్పిటల్ యాజమాన్యాన్ని రెక్వెస్ట్ చేసి ఆ కేసును రిఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ యజమాన్యం డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ రాజేందర్, ఆల్ డాక్టర్స్ అండ్ సిబ్బంది ప్రత్యేక చొరవతో ఈ సర్జరీ సక్సెస్ఫుల్ అయ్యింది. ఈ వారం రోజులలో పూర్తిగా కోరుకున్న శివయ్య సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో డాక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ యుక్త హాస్పిటల్ నిరుపేదలకు ఆయువు లాంటిదని, మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా గానీ యుక్త హాస్పిటల్ ను సంప్రదించాలని కోరారు.
వైద్యం అంటే కార్పొరేట్ ఖర్చులు కాకుండా మానవతా దృక్పథంతో పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ యుక్త ఆస్పటల్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ని చూస్తేనే జంకుతున్న జనానికి,అతి తక్కువ ఖర్చుతో ఎక్కడో జహీరాబాద్ నుండి వచ్చిన శివయ్యను వారం రోజుల్లోగా మళ్లీ మామూలు మనిషిగా చేయడం అంటే, మామూలు విషయం కాదని యుక్త హాస్పిటల్ యజమాన్యంను, డాక్టర్లు, సిబ్బందిని ప్రత్యేకించి కొనియాడారు. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా గానీ యుక్త హాస్పిటల్ ను సంప్రదించాలని కోరారు. అనంతరం స్పందించిన శివయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాకు అతి తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషన్ చేయడం జరిగిందని, శివయ్య అతని భార్య తమ్ముడు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఈరోజు శివయ్య ఆరోగ్యంతో మా కళ్ళ ముందు నిలబడ్డాడు అంటే ఇది కేవలం యుక్త హాస్పిటల్ యజమాన్యం, డాక్టర్లు సిబ్బందికే దక్కుతుందని, వారికి ఏమిచ్చి మా రుణం తీసుకోలేమని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్, అనస్తీసియా పురుషోత్తం, డాక్టర్లు సిబ్బంది వారి టీం కలిసి (ఎల్పీజే) లాట్రీల్ ఫ్యాంక్రియాటిక్ జడ్జినోష్టమి సజ్జనని సక్సెస్ఫుల్గా చేసి శివయ్యకు మరో జన్మను అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్ రెడ్డి డాక్టర్ రాజేందర్ ప్రశాంత్ నగర్ యుక్త హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఖాజా ఖాన్ డాక్టర్లు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.