ఘనంగా సాంస్కృతిక డే

ఘనంగా సాంస్కృతిక డే

వీణవంక, మార్చి 2 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫేర్వెల్ డే సాంస్కృతిక డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్ ప్రిన్సిపాల్ రాజీ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీకి అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమంలో పాల్గొని ఇతరులకు సహాయం చేయాలని ఉద్దేశంతో పనిచేయాలని కోరారు. ప్రతి సబ్జెక్టును ఇష్టపడి చదివి మంచి మార్కు సాధించాలని కోరారు. మంచిగా చదివి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జిల్లాలోని మంచి పేరు తేవాలని విద్యార్థుల కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి, లెక్చరర్స్ కర్ణ, భాస్కర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *