పీర్జాదిగూడ 18వ డివిజన్ లో ఆరు రోజులుగా కొనసాగుతున్న కంటి వెలుగు
స్థానిక కార్పొరేటర్ కుర్ర షాలిని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శిబిరం
పీర్జాదిగూడ, మార్చి 2 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరం. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుర్ర శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గత వారం రోజులుగా మా డివిజన్లో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసి స్వయానా మా కార్యాలయంలోనే డాక్టర్లకు, డివిజన్ ప్రజలకు తదితరులకు మెరుగైన కంటి వెలుగు చికిత్స కోసం అందజేయడం జరిగిందని, ఇప్పటివరకు 750 మందికి పైగా చికిత్స తీసుకున్నారని, 150 మందికి పైగా రీడింగ్ గ్లాసెస్ తీసుకున్నారని, అదేవిధంగా 150 మందికి పైగా గ్లాసెస్ ఆర్డర్ చేయడం జరిగిందని తెలిపారు. ఇంత మంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఇంకా కొన్ని రోజుల పాటు జరిగే ఈ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలందరూ ముఖ్యంగా వృద్ధులు మహిళలు 30 సంవత్సరాలు దాటిన యువత తదితరులు ఈ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని మంచి జీవితాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శ్రీకర, డాక్టర్ సుమ సిబ్బంది, మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.