అంబరాన్నంటిన మహిళా దినోత్సవ ముందస్తు సంబరాలు
- మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…
తిమ్మాపూర్, మార్చి 6 (విశ్వం న్యూస్) : రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసన్నసభ్యులు డా.రసమయి బాలకిషన్ సారధ్యంలో సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన నారీ ప్రభాత భేరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, భారీ ర్యాలీగా సభా ప్రాంగణా నికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు ప్రజాప్రతి నిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్రేన్ ద్వారా భారీ గజమాలను వేసి అపూర్వ స్వాగతం పలికారు.
అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రముఖ టీవీ నటీమణులు, యూట్యూబ్ స్టార్స్ తోపాటూ వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళా మూర్తులను స్త్రీశక్తి పుతస్కరాలతో ఘనంగా సన్మానించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సమాజంలో కుటుంబంలో స్త్రీ పాత్ర గొప్పదని, మహిళ లేనిదే మానవ మనుగడ లేదని, స్త్రీ జాతి గొప్పదనాన్ని, మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అని, మహిళలలో చైతన్యం రావడం కోసం ఉన్నత చదువులు చదువుకోవాలని, మహిళలు విద్యావంతులు అయినప్పుడే అన్ని రంగాలలో రాణిస్తారని, మహిళలకు రాజకీయంతో పాటు అన్ని ఉద్యోగ, ఉపాధి, వ్యాపారంతో పాటు అన్ని రంగాలలో రాణించాలంటే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సభాముఖంగా తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ మహిళల ఎదు గుదల, ఆర్థిక స్వాలంబన దృష్టిలో పెట్టుకొని, మహిళల అభివృద్ధికి కృషి చేసే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలలోని 54 లక్షల మందికి 18 వేల కోట్లను ఆర్థిక స్వాలంబన కింద అందిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నిరంత రాయంగా కరెంటు ఇవ్వడంతో, రాష్ట్రానికి కొత్తగా 20వేల కంపెనీలు వచ్చాయని, కంపెనీల రాకతో తెలంగాణలో 30 లక్షల కొలువులు పెరిగాయని, తల్లిదండ్రులు ప్రతి ఆడ పిల్లను ఉన్నతంగా చదివించాలని, ఏది తోడున్నా లేకున్నా ఆడబిడ్డ తాను చదువుకున్న చదువు జీవిత కాలం తోడు ఉంటుందని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డలు ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేయాలని, మంచి వ్యాపారవేత్తగా ఎదగాలన్నారు. మహిళలకు ప్రతి రోజు మహిళా దినోత్సవం కావాలన్నారు. తెలంగా ణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు టీఆర్ఎస్ బిఆర్ఎస్ గా అవతారం ఎత్తిందన్నారు. మహిళా సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ దే నన్నారు.
కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఆడపిల్లల పేరున ఉండాలని సూచించారు. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం త్వరలోనే మూడు లక్షల అందిస్తా మని, మహిళలకు చట్టసభల్లో అసెంబ్లీ, పార్లమెంట్ తో పాటు అన్ని రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వెంటనే తీర్మానం చేయాలని సూచిం చారు. విఏఓలకు యూనిఫామ్ లు ఇచ్చేలా కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు. మహిళా దినోత్సవం వేడుకలను రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ఎమ్మెల్యే రసమయి ని అభినందించిన అనంతరం నిరుపేద దళిత కుటుం బంలో జన్మించి గొప్ప కళాకారుడిగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర సాధన లో తన ఆటపాటలతో ప్రధాన పాత్ర పోషించిన రసమయన్న ఎమ్మెల్యే కావడం మానకొం డూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని, ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రాంగాలలో అభివృద్ధి పరుస్తున్న రసమయన్నను మరోసారి ఎమ్మెల్యేగా 60 వేల మెజార్టీతో ఆశీర్వదిం చాలని సభాముఖంగా ప్రజలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన మహిళలను, మహిళ ప్రజాప్రతినిధులను, మహిళా ప్రభుత్వ అధి కారులను, మహిళ కళాకారులను, ఆశా, పారిశుధ్య కార్మికులను, గ్రామ సంఘాల సభ్యులను, గాయని, గాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రాథమిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల విజయ, కరీంనగర్ నగర మేయర్ వై సునీల్ రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీ.వి రామకృ ష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్, రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, తిమ్మాపూర్ మండలం జడ్పిటిసి ఇనుకొండ శైలజ- జితేందర్ రెడ్డి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డి, కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్, స్థానిక సర్పంచ్ జక్కాని శ్రీవాణి-రవీందర్, అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డిడబ్ల్యు ఓ సబిత తో పాటు నియోజకవర్గంలోని జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.