విడుదల చేసిన కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్, మార్చి 9 (విశ్వం న్యూస్) : పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని పురస్కరించుకొని కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నేడు ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా సభా ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ గార్లతోపాటు మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, సుమద్ నవాబ్, ఎస్ఏ మోహసీన్, తదితర నాయకులు హాజరై కరీంనగర్ శాసనసభ్యుడు మంత్రి గంగుల కమలాకర్ అవినీతి అక్రమాలపై చార్జిషీట్ విడుదల చేయడం జరిగింది.
మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్నారని, హాజీపూర్ గ్రామంలో 14 ఎకరాల వక్ఫ్ బోర్డ్ భూమిని ఆక్రమించుకుని బినామీగా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, 750 కోట్ల పనులు ఎగవేసి హవాలా నెట్వర్క్ నడిపించాడని దీనిపై ఈ డి సి బి ఐ సంస్థల దాడులు కూడా జరిగినాయని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో 30% కమిషన్ డిమాండ్ చేస్తున్నాడని, కరీంనగర్ లో ఐటీ టవర్ నిర్మాణం పేరుతో 35 కోట్ల ప్రజాధనం వృధా చేశాడని, బోగస్ సిబిఐ అధికారులను సృష్టించి అనేక చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పదుతున్నాడని, బిడ్ ప్రక్రియ నిర్వహించకుండానే కెసిఆర్ అనే అక్షరాలతో సర్క్యూట్ హౌస్ ప్రాజెక్టు నిర్మించి తన అనుచరుడికి కాంట్రాక్టు ఇవ్వడం, కమిషన్ల కోసం కక్కుర్తి పడి మానేరులో అనేక చెక్ డ్యాములు నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల వర్షాలకు కొట్టుకుపోయి ప్రజాధనం వృధా అయ్యిందని, ఈ విధంగా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన కన్నింగ్ కమలాకర్ కు తన పదవి కోల్పోయే రోజులు దగ్గర పడ్డాయని కమలాకర్ వలన నష్టపోయిన వారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని ఆదరించవచ్చని వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో గంగుల కమలాకర్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు