బల్మూర్ వెంకట్ అధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం
హుజురాబాద్, మార్చి 12 (విశ్వం న్యూస్) : ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మరియు రాష్ట్ర NSUI అధ్యక్షులు బల్మూర్ వెంకట్ అధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం (హెల్త్ క్యాంపు) హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ ఉచిత మెగా వైద్యశిబిరంలో గుండెకు సంబంధించిన నిపుణులు, నరాలకు సంబంధించిన నిపుణులు అలాగే స్కానింగ్, ఈసీజీ లాంటి అత్యాధునిక పరికరాలతో టెస్టుంగులు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందచేస్తున్నారు. ఈ ఉచిత మెగా వైద్యశిబిరం శ్రీ బల్మూర్ వెంకట్ గారి సతీమణి శ్రీమతి డాక్టర్ శ్రీ రమ్య గారు మరియు వారి వైద్య నిపుణుల బృందంచే నిర్వహిస్తున్నారు.