ఘనంగా వెల్ది ప్రభుత్వ పాఠశాలలో
70వ వార్షికోత్సవం
- ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే రసమయి, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణా రావు, జెడ్పి చైర్మన్ కనుమల్ల విజయ
మానకొండూరు, మార్చి 15 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 70వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతున్న గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణా రావు, జెడ్పి చైర్మన్ కనుమల్ల విజయ. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గ్రామ సర్పంచ్ రుద్రవరం లక్ష్మీ – సాయి కుమార్, ఎంపిటిసి రుద్రవరం పద్మ-ప్రభాకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.