బి.కె డాక్టర్ గూడూరి విజయలక్ష్మి గారికి ఘన సన్మానం

అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకం సంపాదకురాలు శ్రీమతి బండి ఉషకు అభినందన సత్కారం
విశ్వం న్యూస్, హైదరాబాద్ (27.12.2022): హైదరాబాద్లో సోమవారం నాడు స్నేహితం ట్రస్ట్, బండి కళ్ళు వెంకటేశ్వర్లు ఫౌండేషన్, సాహితీ సంస్థలు, రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్స్ గారి సంయుక్త కలయికలో… ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ COVID- 19 సమయంలో తన పరివారంతో కలిసి రాత్రింబవళ్లు పనిచేస్తున్న అవసరం ఉన్నవారికి అన్నదాన కార్యక్రమం, గుడిలో పనిచేస్తున్న అర్చక బ్రాహ్మణులకు, హైదరాబాదులోని పశు వుల గోశాలలకు పశుగ్రాసము సప్లై చేయుట, వలస కూలీలకు, మరియు నిత్యవసర కిట్లను అందజేసినందుకు గుర్తింపుగా ఏషియన్ వేదిక్ కల్చరల్ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ అవార్ట్-2022ను పొందిన గూడూరి ఫౌండేషన్ కోశాధికారిణి శ్రీ బ్రహ్మ కుమారీ గూడూరి విజయలక్ష్మి గారిని, మరియు 527 కవుల సంకలనాలను సమకూర్చి “అమ్మకు అక్షర నైవేద్యం” పుస్తక సంపాదకురాలు శ్రీమతి బండి ఉషా గారిని మరియు రాష్ట్రంలోని సాహిత్య రంగంలో పేరుగాంచిన ప్రముఖులు మఖ్య అతిధి శ్రీ డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ గారు (ప్రముఖ ప్రవచనకర్త), సభాధ్యక్షులు శ్రీ పుత్తూరు సుబ్బారావు గారు (సంపాదకులు, సాహితీకిరణం), సభా ప్రారంభకులు శ్రీ గుదిబండి వెంకట్ రెడ్డి గారు (చైర్మన్. జి.వి.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్), అతిధి సత్కారంశ్రీ బొప్పన నరసింహారావు గారు (స్థాపక అధ్యక్షులు, కళావిపంచి), ఆత్మీయ అతిధులు శ్రీ మట్టి గుంట వెంకటరమణ గారు (అధ్యక్షులు, ఎమ్.వి.ఆర్ ఫౌండేషన్), శ్రీ ఎన్ రఘువీర్ ప్రతాప్ గారు (అధ్యక్షులు, దర్శకేతనం కళాపీఠం), శ్రీ రవి కుమార్ గారు (అధ్యక్షులు, తెలుగు రాజ్యం కల్చరల్ ఫౌండేషన్), శ్రీ ఎం.ఏ. హమీద్ గారు (మా అసోషియేషన్), వి. రాధాకృష్ణ గారు, మల్లేశ్వరరావుగారు బయ్యారం, పెద్దూరి వెంకట దాసు గారు, చింతపల్లి శోభా రెడ్డి (రాష్ట్ర ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్), బండి కళ్ళు శ్యాం ప్రసాద్ గారు, శ్రీ జి. శ్రీధర్ రెడ్డి గారు, జి. మహేందర్ రెడ్డి గారు (ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్), జి. కళ్యాణి రెడ్డి గారలందరును కలిసి సన్మానించిన సభలో పాల్గొన్న ఇండియన్ ప్రజాకాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నేషనల్ జనరల్ సెక్రెటరీ, అడ్మినిస్ట్రేషన్ డా. గూడూరి చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ రవి గాంచని చోట కవిగాంచిన మాటకు నిలువెత్తు సాక్ష్యం కవులు, కళాకారులు అందులో ముఖ్యంగా మహిళలు, ఈ సభలో ఇద్దరు మహిళలను ఇంతమంది కవులను సన్మానించబడుటమనేది జీవితంలో అరుదైన ఘట్టం అనక తప్పదని, అలాగే వీరు మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, తమ రచనల ద్వారా రాబోవు తరాలకి మార్గదర్శకులుగా నిలబడతారని, సమాజంలోని చెడును పారదోలే శక్తి కవి రచించే కవిత్వాలు వల్లనే సాధ్యమైతాదని, అందుకనే మీరు మునుముందు అనేక కార్యక్రమాలు చేపడుతూ, ఈ సన్మానాల వల్ల మీకు ఎంతో బరువు బాధ్యత పెరిగిందని తెలుపుతూనే సభా కార్యక్రమంలో చిరంజీవి వన్ రాజ్ రెడ్డి గారు చేసిన నృత్యం ఆహుతులను సంబరమాశ్చర్యాలకు గురిచేసింది. ఇలాంటి చిన్నారులను ఆశీర్వదించి వారి భవిష్యత్తుకు మార్గదర్శకులు వచ్చిన పెద్దలందరూ ఆశీర్వదించాలని, అలాగే ఇంత మంచి నైపుణ్యం కలిగిన నృత్యంతో పాటు చదువులో కూడా నెంబర్ వన్గా రాణించాలని, అలాగే ఈ కార్యక్రమంలో చిరంజీవి బేబీ తరుణి తన యొక్క వచ్చిరాని మాటలతోటి సభలో అందరి ముఖాలపై నవ్వులు పులకరింపజేసింది అని హితవు తెలుపుతూ సెలవు తీసుకున్నారు.