హైదరాబాద్, మార్చి 24 (విశ్వం న్యూస్) :
- • ఎమ్మెల్సీల విజయంలో ఈ సెల్స్ కీలకం
• ఇది చంద్రబాబు మార్క్ విజయం
• టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ముందు ఎవ్వరైనా తలవంచాల్సిందే.
• బెదిరింపు రాజకీయాలు చేయరు. దౌర్జన్యం అంతకన్నా ఉండదు.
• కానీ ఆయనకు ఉండే పక్కా లక్షణం ఒక్కటే.. పొలిటికల్ ప్లానింగ్
• అంతా చూస్తారు, పొలిటికల్ నాడి పట్టేస్తారు… అంతే ఇక..
• చదరంగంలో చక్కగా పావులు కదిపి ఆట ఆడించేస్తాడు.
• మరి, అలాంటి చంద్రబాబు 2019 వ్యూహం ఏమైంది అనుకోవచ్చు.
• ఎంతటి వ్యూహ చతురత ఉన్న నేతలనైనా అతి విశ్వాసం కొంపముంచుతుంది.
• అప్పుడు అదే జరిగింది, కాబట్టే వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది.
• కానీ, ఇపుడు ఆడే ఈ ఆటలో టీడీపీ నాయకులు పాత్రధారులు మాత్రమే.
• చంద్రబాబుగారి ప్రైవేట్ టీమ్ దీని వెనుక ఎంతో కసరత్తు చేసింది.
• పెద్దాయన తమ నాయకులను నమ్మినట్టు ఉన్నా సరే,
• తన ప్లాన్ అమలు చేసేందుకు ఈసారి ప్రైవేట్ టీమ్ ను ఉపయోగించారు.
• ఈ టీమ్ వాళ్లెవరూ పార్టీ ఆఫీస్ లో ఉండరు, మైక్ ల ముందుకు రారు.
• బాబు గారిని ఆలింగనం చేసుకొనే బ్యాచీలో కూడా వీరు ఉండరు.
• కాలర్ ఎగురేయరు. కేకులు తినేవారిలో ఉండరు, సెటిల్మెంట్లు చెయ్యరు.
• వీళ్ళకు పార్టీ పదవులు అక్కర్లేదు, చాలా సాదాసీదాగా ఉంటారు.
• బాబుగారు ఇచ్చిన ఏ పనైనా పక్కనవాడికీ చెప్పరు. చేసుకుపోతారు
• ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళను పొలిటికల్ స్లీపర్ సెల్స్ అనుకోవచ్చు.
• బాబు గారు వ్యూహం వేస్తారు, వీళ్ళు పకడ్బందీగా అమలు చేసేస్తారు.
• ఇలాంటి టీమ్ చంద్రబాబు దగ్గర ఉంది కాబట్టే, సక్సెస్ మీద సక్సెస్
• మొన్న పట్టబద్రుల ఎన్నిక అయినా, నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయినా అంతే
• వీరు పక్కాగా ప్లాన్ చేసి అమలు చేసేస్తారు. విజయం సాధించి పెడతారు.
• బాబుగారు ఇలాంటి పొలిటికల్ స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకొన్నారు.
• అందుకే, వ్యూహాత్మకంగా తడబాటులేకుండా ముందుకు వెళుతున్నారు.
• చివరకు టిడిపి బీట్ చూసే జర్నలిస్ట్ లు కూడా అనురాధ విజయాన్ని వూహించలేదు.
• స్లీపర్ సెల్ టీమ్ వాళ్లు.. అయితే అటు లేదా ఇటు అంటూ పొద్దున నుంచి చెప్పారు
• అంతేగానీ ఒక్క లీక్ కూడా ఇవ్వకుండాతమపని తాము చేసుకుపోయారు.
• ప్లాన్ అమలైంది, పని అయ్యిపోయింది, దటీజ్ చంద్రబాబు నాయుడు