మోడీ నియంత్రుత్వానికి పరాకాష్ట : పొన్నం ప్రభాకర్

మోడీ నియంత్రుత్వానికి
పరాకాష్ట : పొన్నం ప్రభాకర్

కరీంనగర్, మార్చి 24 (విశ్వం న్యూస్) : 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు నేపథ్యంలో నిన్న సూరత్ హైకోర్టు రాహుల్ గాంధీ గారికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు ఖండిస్తూ పిసిసి పిలుపుమేరకు నేడు కరీంనగర్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మౌన దీక్ష నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు హాజరైనారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. నిన్న ఒక చీకటి దినం ఎందుకంటే దేశంలోనే ప్రతిపక్ష పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ 2019లో ఎన్నికల ప్రచారంలో అన్న మాటను తప్పుపడుతూ వేసిన కేసును వాయిదా వేస్తూ చట్టసభకు అర్హత లేని విధంగా చూడాలని చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా శిక్ష విధించి భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర నిన్న బహిర్గతమైంది, దీనిని దేశ ప్రజలు గుర్తించాలని, అందుకే నేడు మహాత్మా గాంధీ సాక్షిగా ఈ మౌన దీక్ష చేపడుతున్నామని, అందుకే ఈదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం బ్రతికి ఉంటేనే ఈ దేశం ముందుకు నడవగలుగుతుందని చెప్పిన వ్యక్తి, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపార వేత్తలకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని వాస్తవాలను ధైర్యంగా చెప్పిన వ్యక్తి, నరేంద్ర మోడీ గురించి వాస్తవాలను తెలియజేసిన బిబిసి లాంటి ఛానల్ ను నిషేధించే పరిస్థితుల్లో, దేశంలో వరుసగా మోడీ లే ఈ దేశంలో అవినీతిపరులు అవుతున్నారని అంటే మోడీ అని పేరున్న ఒక న్యాయవాది కేసు వేయడం వెనుక రాజకీయపరంగా కుట్ర జరిగిందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని, దేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారని నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామిక విధానాన్ని అంతం చేయాలని నేడు కాంగ్రెస్ పక్షాన చేపట్టిన ఈ మౌన దీక్ష కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలను, నగర ప్రజలను కోరుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి చర్ల పద్మ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు మెనెని రోహిత్ రావు, దన్న సింగ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ముక్క భాస్కర్, వంగల విద్యాసాగర్, నాగుల సతిష్, బొబ్బిలి విక్టర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *