తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీరాముల శ్రీకాంత్ నాయీ గారి నియామకం

కరీంనగర్, డిసెంబర్ 29, (విశ్వం న్యూస్) : గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఐక్యవేదికలో క్రియాశీలకంగా పనిచేస్తూ నాయీబ్రాహ్మణుల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం నిరంతరం పనిచేసినందుకు గాను శ్రీరాముల శ్రీకాంత్ గారి నియమించడం జరిగిందని ఇకముందు వారి సేవలను రాష్ట్రస్థాయిలో తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక విస్తరణ అదేవిధంగా నాయీబ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం కోసం వినియోగించుకునే విధంగా వారిని రాష్ట్ర కమిటీ లో రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగిందని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నియమితులైన శ్రీరాముల శ్రీకాంత్ గారు మాట్లాడుతూ నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు గాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానల కిషన్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవుదుర్తి విజయ్ కుమార్ గారికి, జిల్లా అధ్యక్షుడు జంపాల నర్సయ్య గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా చేస్తున్నట్లు నియామక పత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గర్శకుర్తి విద్యాసాగర్, కొత్వాల అంజనేయలు.